నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపి షెడ్ మండలంలో సేవ పక్షం మండల స్థాయి కార్యశాల మండల అధ్యక్షులు మల్కాని నాగేష్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి అశోక్ సాదుల హాజరై మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు 15 రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వచ్చే స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవాలని పిలుపునిచ్చారు.