టిప్పర్ వాహనం కిందపడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన తలమడుగు మండలం డోర్లీ సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మంద గూడ గ్రామానికి చెందిన మెస్రం మహేందర్ ఆదిలాబాద్ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా డోర్లీ సమీపంలో రోడ్డు పనులు చేపడుతున్న టిప్పర్ వాహనం రివర్స్ లో వచ్చి వెనకాల వున్న మహేందర్ ను ఢీ కొట్టింది. దీంతో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.