ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం వర్షపు నీటిలో రైతులు అవస్థలు పడుతున్నారు. యూరియా కట్టల కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు కావాల్సిన యూరియాను అందించాలని రైతులు కోరుతున్నారు.