Araku Valley, Alluri Sitharama Raju | Aug 25, 2025
అనంతగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వసతి గృహ భవనాలను వెంటనే నిర్మించాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ సోమవారం డిమాండ్ చేసింది సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎస్ఎఫ్ఐ బృందం అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలను, నిర్మాణం లో నిలిచిపోయిన వసతి గృహ గదులను ఎస్ఎఫ్ఐ పరిశీలించింది ఈ సందర్భంగా అసంపూర్తిగా నిలిచిపోయిన వసతి గృహాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆందోళన చేసింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు కార్తీక్ శ్రీను కార్యదర్శి జీవన కృష్ణ లో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి స్పందించి తక్షణమే జూనియర్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు