తాడ్వాయి : అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇండ్ల గుర్తింపు ఈరోజు సాయంత్రంలోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండల కేంద్రంలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి తక్షిణ సాయంగా ఇంటి యజమానులకు నష్టపరిహారంగా రూ. 5000 రూపాయలను అందించాలని తాసిల్దార్ ను ఆదేశించారు. అలాగే గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరుసగా కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న మరియు కూలిపోయిన ఇళ్లకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని అన్నారు.