కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 న ప్రారంభించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకంతో ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని కొత్త పేటలో గల మల్లయ్య లింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరుణ్ కుమార్, యూనియన్ జిల్లా అధ్యక్షులు మంగా శ్రీనివాసరావు మాట్లాడారు గుంటూరు పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆటో రంగా కార్మికుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి పస్తులతో జీవిస్తున్నారని తెలిపారు.