సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ డ్రెస్ల పంపిణీ, డిజిటల్ మీడియా బోధనలను కలెక్టర్ పరిశీలించారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని అందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.