మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బడి గా మారింది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని 27 ప్రభుత్వం ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి, మహబూబ్ నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శతశాతం అనే కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణ, మహబూబ్ నగర్ రూరల్, హన్వాడ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మహబూబ్ నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించారు