పాల్వంచ మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామానికి చెందిన సుహాసిని భర్త మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.. ఒంటరిగా ఉన్న ఆమెపై మనసు పడ్డ ఆమె మరిది మహేష్ ఆదివారం ఆమె పంటచేలో ఉండగా ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.. అనంతరం అక్కడ నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకున్న ఆమెను ఆమె ఇంట్లోనే మరోసారి దూషిస్తూ ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు.. పెద్దమనుషులకు చెప్పిన ఫలితం లేకపోవడంతో ఆమె రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ హెడ్ కానిస్టేబుల్ హరిబాబు తెలిపారు..