బాధితులు, ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల డీసీపీ శనివారం ఉదయం లక్షేట్టిపేట్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండిoగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ, డిసిలు, మిస్సింగ్, ఆస్తి నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు