ధర్మవరం పట్టణం శివానగర్లో పామిశెట్టి చౌడయ్య అనే చేనేత కార్మికుడు సోమవారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య లక్ష్మీదేవి తెలిపిన వివరాల మేరకు గత 15 రోజుల నుండి వర్షాలు వచ్చి మగ్గాలు జరగక కుటుంబ పోషణకు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయింది.