స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథిగృహంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని చెప్పారు. రిజర్వేషన్లతో బీసీలకు రాజకీయంగా అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.