విశాఖ డాబా గార్డెన్స్ ఉమెన్స్ కళాశాలలో శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా మెగా జాబ్ మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్దేశించి వివిధ కంపెనీల నుంచి వచ్చిన వారికి ముందస్తుగా అభినందనలు తెలియజేశారు అదేవిధంగా నియోజవర్గంలోని ఎంతోమంది ఉపాధి అవకాశాలు లేక ఉన్నారని అదేవిధంగా రానున్న కాలంలో కూడా మరిన్ని ఉపాధి అవకాశాలు వచ్చేలా ఇక్కడ జాబ్ మేళాలు నిర్వహించాలన్నారు