కడపలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం స్త్రీ శక్తి సమావేశాన్ని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి నిర్వహించారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఆమె పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం, అలాగే స్త్రీ శక్తి పథకం లక్ష్యాలు, ప్రయోజనాలను మహిళలకు వివరించారు. మహిళా సాధికారత కోసమే టీడీపీ కృషి చేస్తోందని ఆమె వెల్లడించారు.