*పెద్దాపురం నియోజకవర్గంలో సిఎం పర్యటనలో సీఎం కాన్వాయ్ ముందు పడ్డ గంగాధర్ అనే వ్యక్తి భద్రత సిబ్బంది అడ్డుకున్న వెంటనే కాన్వాయ్ ఆపి ఆ యొక్క వ్యక్తితో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ కు చెందిన కొమ్ము గంగాధర్ అనే వ్యక్తి, గొల్లప్రోలు లో గత ప్రభుత్వంలో రీ సర్వే సమయంలో తప్పులు జరిగాయని,ఈ విష్యాన్ని అధికారులు పట్టించుకోవడంలేదని తనకు న్యాయం చేయాలని గంగాధర్ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లారు. 70 సార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడంలేదని సీఎం కి వివరించారు.