గుత్తి లోని జంగాల కాలనీలో తాటికొండ రమణ ఇంటిలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళాలు ఓపెన్ చేసి లోపలకు ప్రవేశించారు. బీరువాలో దాచి ఉంచిన ఎనిమిది తులాల బంగారు, 45 కులాల వెండి ఆభరణాలను అపహరించారు. అంతేకాకుండా రూ.2,20,000 నగదు అపహరించారు. బాధితుడు రమణా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ చోరీ జరిగిన ఇంటిని పోలీసులు పరిశీలించారు. ఈ సంఘటనపై బాధితుడు తాటికొండ రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.