అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన సాయి సాకేత్ అనే యువకుడు అమెరికాలోని ఆప్టివర్ సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.5కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. పట్టణానికి చెందిన రమేష్, వాసవి దంపతుల కుమారుడు ప్రస్తుతం బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతూ ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు. తొలుత 10 వారాల ఇంటర్న్ షిప్ ఉంటుందని అందుకు గాను కోటి రూపాయలు కంపెనీ ఇవ్వనుంది. అనంతరం ప్రతిభను బట్టి ఎంపిక చేసి రూ.5కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందనున్నాడు. పలువురు అభినందించారు.