అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రానికి మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తో కలిసి పరిశీలించారు. పేరూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కొన్ని తరగతి గదులు ఖాళీ ఉన్న నేపథ్యంలో తొలుతగా డిగ్రీ కళాశాలను ఆ యొక్క రూములలో ప్రారంభించి దశలవారీగా భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.