భూ వివాదంతో రైతు పై దాయాదుల దాడి భూ వివాదం తలెత్తి రైతుపై దాయాదులు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం మదనపల్లె మండలం లో జరిగింది. బాధిత రైతు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మండలంలోని మాలెపాడు పంచాయతి, దిగువ దొనబైలుకు చెందిన రైతు వై నాగరాజు (56) అతని దాయాదులు వై మల్లికార్జున, చంద్ర, విశ్వనాథ్ లకు గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు తలెత్తి మల్లికార్జున, విశ్వనాథ్, చంద్ర లు రైతు నాగరాజు పై కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కుటుంబీకులు బాధితుని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యా