ప్రభుత్వ బియ్యాన్ని హాస్టల్ నుంచి వార్డెన్ అక్రమంగా తరలిస్తున్న ఘటన హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో బీసీ బాయ్స్ హాస్టల్ చోటు చేసుకుంది. టాటా ఏసీ లో 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని హాస్టల్ వార్డెన్ తరలిస్తుండగా పక్క సమాచారంతో పరకాల పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. హాస్టల్ 29 క్వింటాళ్ల బియ్యం సరఫరా కాగా అందులో నుంచి 12 క్వింటాళ్ల బియ్యం వార్డెన్ తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. విక్రయదారులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.