సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజు చేరుకున్నాయి. శనివారం స్వామివారికి ప్రత్యేకంగా దూర్వా (గరిక) హవనం నిర్వహించారు. అనంతరం బలి ప్రదానం, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపి భక్తులకు మహా దాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.