తాడ్వాయి మండలం మేడారంలో రేపు శనివారం జరిగే విస్తృత స్థాయి సమావేశానికి బయక్కపేట, నార్లాపూర్, మేడారం, ఊరట్టం, కాల్వపల్లి, వెంగళపూర్ గ్రామాలకు చెందిన రైతులందరూ పార్టీలకతీతంగా పాల్గొనాలనీ నార్లాపూర్ రైతులు నేడు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు కోరారు. మేడారం సందర్భంగా వందల ఎకరాల భూమిని వాహనాల పార్కింగ్, భక్తుల విడిది కోసం ప్రభుత్వం పంట వేయకుండా ఆపడం వల్ల తమ పంట నష్టపోతున్నామని చెప్పారు. రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు.