మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎరువుల కోసం రైతులు మరోసారి రోడ్డు ఎక్కారు.మంగళవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతం లో రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులకు సరిపడా ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో పంట పొలాలకు ఎరువులు అందించకపోతే పంట దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఎరువులు అందించేందుకు ఏర్పాటు చేయాలని కోరారు.