అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోకి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లవచ్చని ఆదేశాలు ఇచ్చింది. భారీ భద్రత నడుమ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి తీసుకెళ్లాలని కోర్టు తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు అనుమతి ఇచ్చింది.