పని భారం తగ్గించాలని,యాప్ లలో పనిచేసే విధానం రద్దు చేయాలని,ఎన్ సి డి ఆన్లైన్ వర్క్ నుండి ఏ ఎన్ ఎం లను మినహాయించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఏ ఎన్ ఎం లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. యాప్ లలో వర్క్ లు చేపిస్తూ విపరీతమైన పని భారం పెట్టారని దాని వల్ల ఫిల్డ్ లలో పని చేయలేకపోతున్నామని అన్నారు. ఆన్లైన్ వర్క్ ల వల్ల ఒకదగ్గరే కూర్చుని ఉన్న సమయం మొత్తం కేటాయించాల్సి వస్తుందని అన్నారు. ప్రతి సర్వే కు మమ్ములను ఇబ్బంది పెడుతూ భారం పెంచుతున్నారని అన్నారు.