పెద్ద కడబూరు: మండలంలో వెరిఫికేషన్ పేరుతో 156 మంది దివ్యాంగుల పింఛన్లు నిలిపివేయడాన్ని సీపీఎం, సీపీఐ ఎంఎల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో పరిపాలన అధికారి కౌసల్యకు వినతిపత్రం అందజేశారు. ఈ నిర్ణయం దివ్యాంగుల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని, వెంటనే పింఛన్లు పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. మరియు మండలంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని వారి కోరారు.