జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు.ఈ లోక్ అదాలత్‌కు కక్షిదారుల నుండి అనూహ్య స్పందన లభించింది.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 11 బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి జాతీయ లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. జిల్లాలో కొత్తగూడెం ఇల్లెందు భద్రాచలం మణుగూరు కోర్టులలో 4576 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు.రాజీమార్గంలో కేసుల పరిష్కారంకోసం కక్షిదారులు పెద్దఎత్తున ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇందుకు న్యాయవాదులు,కోర్టు సిబ్బంది,పోలీసు యంత్రాంగం చేసిన కృషిని కొనియాడారు.