వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని ఈనెల 27వ తేదీ నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు MLA గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం MLA నివాసంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా దేవాలయంలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వంటశాల తో పాటు రాజగోపురం నిర్మాణ పనులు కొనసాగుతాయన్నారు.