Kavali, Sri Potti Sriramulu Nellore | Jul 17, 2025
కావలి పట్టణం 15, 16వ వార్డుల్లో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం గురువారం జరిగింది. ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి డోర్ టు డోర్ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటలకు జరిగింది.