బాపట్ల పట్టణంలో మహాత్మా గాంధీ రోడ్డులోని రిలయన్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న భవనం పైకి తెల్లవారుజామున ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి ఎక్కి గురువారం కలకలం సృష్టించాడు. మార్కెట్లో అర్ధరాత్రి ఫోన్, డబ్బులు దొంగిలించబడ్డాయని ఆవేదన చెందిన యువకుడిని పట్టణ పోలీసులు చాకచక్యంగా కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా బాపట్ల పట్టణ సీఐ రాంబాబు తెలిపారు.