అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం జైపూర్ మండలంలోని నీలగిరి ప్లాంటేషన్ లో అడవుల రక్షణకు పాటుపడి అమరులైన అటవీ అధికారులకు సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు అమరులైన అటవీ అధికారులు, సిబ్బంది చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ శ్రావణి మాట్లాడుతూ అడవుల రక్షణకు అందరూ సహకరించాలని, తద్వారా పర్యావరణానికి మేలు చేసిన వారవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్, డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ జె. నరేష్, వాచర్ లు, సిబ్బంది పాల్గొన్నారు.