మద్యానికి బానిసైన తండ్రి తన ఐదు రోజుల పాపను అమ్మకానికి పెట్టిన దారుణం ఒంగోలులో మంగళవారం సాయంత్రం వెలుగు చూసింది.అద్దంకి బస్టాండ్ వద్ద ఆ వ్యక్తి కొందరితో బేరసారాలు సాగిస్తుండగా స్థానికులు గమనించి బాలల సంరక్షణ అధికారులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు.దీనితో వారు అక్కడికి వెళ్లి ఆ పాపను తమ ఆధీనంలోకి తీసుకొని సఖి వన్ స్టాప్ సెంటర్ కు సురక్షితంగా చేర్చారు.పాప తండ్రిని పోలీసులకు అప్పగించారు.