కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడమే బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన అప్పుడే మంచిగ ఉండే కార్యక్రమం లక్ష్యమని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ లో అప్పుడే మంచిగ ఉండే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కల్యాణ లక్ష్మి, షాది ముభారక్ ద్వారా ఆడబిడ్డలకుఇస్తామన్న తులం బంగారం, పేద మహిళలకు 2500 రూపాయల పెన్షన్లు, కేసీఆర్ కిట్టు, 500రూపాయలకే గ్యాస్ సిలిండర్, నిరుద్యోగ భృతి, రైతు బంధు, ఇలా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదనన్నారు