దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర లోని ప్రసిద్ధ కేలాపూర్ జగదంబ మాత ఆలయం వరకు భక్తులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక రాణి సతీమాత ఆలయం నుండి శనివారం పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా డీఎస్పీ జీవన్ రెడ్డి రాణి సతీమాత ఆలయంలో పూజలు చేసి, అనంతరం జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఆదిలాబాద్ నుండి దాదాపు 41 కిలోమీటర్ల దూరం లో ఉన్న కేలాపూర్ లోని జగదంబా మాత ఆలయం వరకు నడిచి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న భక్తులు కాషాయ జెండాలను చేతపట్టుకుని తరలివెళ్లారు