మహానంది పరిధిలోని కోనేటి కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. చనిపోయిన వ్యకి బనగానపల్లె మండలం ఇల్లూరి కొత్తపేటకు చెందిన సుంకన్నగా గుర్తించారు. సుంకన్న అక్క సుబ్బలక్ష్మమ్మ కొన్ని నెలలుగా మహానందిలో యాచిస్తూ జీవనం సాగిస్తోంది. అక్కను చూసేందుకు వచ్చిన సుంకన్న ఆమెతో మాట్లాడిన తర్వాత కాలువ గట్టు వద్ద కూర్చోగా మూర్ఛకు గురై కాలువలో పడ్డాడు. దురదృష్టవశాత్తు ఎవరూ గుర్తించకపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.