ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల ప్యాకేజీ మంజూరు చేసి పంట నష్టం జరిగిన రైతులకు, దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, మౌలిక వసతులు పునరుద్ధరించాలి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. భారీ వర్షాలు, వరదల సమయంలో రాత్రింబవళ్లు శ్రమించి ఎల్లారెడ్డి ప్రజలను రక్షించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి అభినందనీయమైంది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి ఫలితంగా, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎల్లారెడ్డి కి తీసుకొచ్చారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటారని తెలిపారు.