రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ సత్తా చాటుదామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం పిలుపునిచ్చారు.గురువారం పాల్వంచ చండ్ర రాజేశ్వరరావు భవన్ లో సీపీఐ మండల కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పాల్వంచ ప్రాంతంలో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలు ఎదురుకుంటున సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీనీ మరింత విస్తరణకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని,ప్రతి గ్రామంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ ప్రాతినిధ్యం ఉండే విధంగా గ్రామాల్లో కార్యకర్తలను ప్రజలను సిద్ధం చేయాలని కోరారు.