ఈ ఏడాది మార్కెట్ సంక్షోభం దృష్టిలో పెట్టుకొని APలో 2025-26 సంవత్సరానికి 142 మిలియన్ల పొగాకు ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు కామేపల్లి క్లస్టర్ ఫీల్డ్ అసిస్టెంట్ మనీశ్ కుమార్ తెలిపారు. జరుగుమల్లి మండలం కామేపల్లి పైడిపాడు గ్రామాల్లో పొగాకు నర్సరీలు సాగు చేసే రైతులకు సూచనలు చేశారు. పొగాకు పంట నియంత్రణలో భాగంగా నర్సరీ దశ నుంచి అన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్పారు. బుధవారం పొగాకు బోర్డు అధికారులు జరుగుమల్లి మండలంలోని పలు పొగాకు పొలాలను పరిశీలించారు.