రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, గోపాలరావుపల్లి గ్రామంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి (కోసా) అంత్యక్రియలను ఘనంగానిర్వహణ. కామ్రేడ్ కడారి సత్యనారాయణ రెడ్డి చత్తీస్గడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన గోపాలరావు పల్లెకు తరలించారు. కడసారి చూపు కోసం గ్రామస్తులు, బంధువులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన మృతదేహం వద్ద ఘన నివాళులర్పించారు. ఆయన అంతక్రియలలో గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు అంతక్రియలో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు.