ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన మంచిది కాదని, అది అసాధారణమైన ఆలోచన అని, అలాంటి ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా మానసిక వైద్యులను సంప్రదించాలని సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మానసిక వైద్యులు చెప్పారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పిల్లలను అధిక ఒత్తిడికి గురి చేయకూడదని, దాంతో ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ ఆత్మహత్య లపై, మానసిక ఒత్తిడి పై అవగాహన ముఖ్యమన్నారు. పిల్లలు గానీ, ఇతరులు ఎవరైనా మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు వెంటనే సిద