గుంటూరు జిల్లా పెదనందిపాడులో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం పొగాకు రైతులు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తమ పొగాకును కర్లపాలెం, ప్రతిపాడు గ్రామాలకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు తెలిపారు. తహసిల్దార్ హేనా ప్రియ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారు.