అనంత రూపాలో భక్తులకు దర్శనం ఇచ్చే గణనాధుడు పాల్వంచలో 1 కోటి 50 లక్షల రూపాయల విలువచేసే కరెన్సీ నోట్లతో అలంకరించుకొని వినూత్నంగా దర్శనమిచ్చాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని రామ్ నగర్ తూర్పు కాపు సంఘం వారు గత 28 సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం వినాయకుడి మండపాన్ని పూలతో,విద్యుత్ దీపాలంకరణలతో అంగరంగ వైభవంగా అలంకరించారు.గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు లక్ష్మీవారం కావడంతో 10,20,50,100,200 నుంచి 500 నోట్లతో వినాయకుడిని1 కోటి 50 లక్షల రూపాయలతో వైభవంగా అలంకరించారు.