ప్రభుత్వం నూతనంగా జారీ చేస్తున్న రేషన్ కార్డుల సర్వే పక్రియ కొనసాగుతోంది. శనివారం ADBలోని షాద్నగర్, కైలాస్నగర్లో సర్వే పక్రియను DSO మహ్మద్ వాజీద్ అలీ పరిశీలించారు. పారదర్శకంగా సర్వే చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్బన్ ఏరియాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షల వార్షిక ఆదాయం, 60 స్క్వైర్ యార్డు ఇల్లు, 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న వారే అర్హులని తెలిపారు.