గణపతికి పూజ చేసే ప్రయత్నంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. శుక్రవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాడవాడలా వినాయకులను ప్రతిష్టించిన చోట పూజలు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఓ పూజారిని కొంతమంది ఇలా తమ గణపతికి పూజ చేయాలని లేదు తమకు చేయాలని గుంపుగా ఎగబడి ఎత్తుకొని వెళ్ళారు. హుటాహుటిన ద్విచక్ర వాహనం మీద తీసుకుని గణపతి మండపానికి తీసుకెళ్లారు. పూజారి కోహెడ కు చెందిన టేల కనకయ్య కాగా, ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.