కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన అనూష అనే యువతి ప్రేమ విఫలం కావడంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గన్నారం గ్రామానికి చెందిన సందీప్ అనే యువకుడు అనూష గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని అనూష సందీప్ తో అనడంతో మీరు తక్కువ కులం వారని నిన్ను ఎలా చేసుకుంటానని పెళ్లి విషయం దాటవేయడంతో మనస్థాపం చెందిన అనూష ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు,