సంగారెడ్డి కొండాపూర్ మండలం అలియాబాద్లో గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను ఇప్పుడు తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీయల్ కార్పొరేషన్(టీజీఐఐసీ)కి ఇవ్వడాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. శుక్రవారం సంగారెడ్డిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మరో కుంభకోణానికి జగ్గారెడ్డి తెరలేపుతున్నారని ఆరోపించారు. అలియాబాద్ భూములను పేదలకే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.