Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: అమ్మగార్డెన్ లో కత్తితో హల్చల్ సృష్టించిన ఓ యువకుడు

Mancherial, Mancherial | Sep 6, 2025
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జనం అనంతరం అమ్మగార్డెన్ రోడ్ నెంబర్ 1లో ఓ యువకుడు కత్తితో హల్చల్ సృష్టించాడు. అక్కడి ఓ కుటుంబంపై దాడి చేసేందుకు యత్నించినట్లు సమాచారం. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులపైనా యువకుడు తిరగబడినట్టు చెబుతున్నారు. ఈ మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us