గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలపై అధికారులకు అంతు చిక్కడం లేదు. అధికార, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పరామర్శల కోసం తురకపాలెంకి క్యూ కడుతున్నారు. అధికారులు రక్తపరీక్షలు చేసి, ల్యాబ్కి పంపించాము 72 గంటల్లో రిపోర్ట్లు వస్తాయని చెప్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రజల భయానికి భరోసా కల్పించేలా లేదని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు మాత్రం గ్రామస్తులకు ఉచిత మంచినీరు భోజన సదుపాయాలు కల్పించారు. దీనిపై పూర్తిస్థాయి అన్వేషణ అధికారులు చేపట్టారు.