కలికిరి మండలం కలికిరి మేజర్ గ్రామ పంచాయతీ అంకెంవారి పల్లి గ్రామంలో నానో ఎరువులు మరియు జీవన ఎరువులు పై అవగాహన కార్యక్రమం మండల వ్యవసాయ అధికారిణి హేమలత ఆధ్వర్యంలో సోమవారం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జి.శివ నారాయణ పాల్గొని నానో ఎరువులు మరియు జీవన ఎరువులు ఉపయోగాలను రైతులకు తెలియజేశారు.అదేవిధంగా కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంజుల మాట్లాడుతూ అజోల్ల, ఆజో స్పైరిల్లం లాంటి జీవన ఎరువులు వాడడం వలన కలిగే ఉపయోగాలను తెలియజేశారు. నానో యూరియాను ఎలా వాడాలి, డ్రోన్ ద్వారా వాడడం వలన రైతులు కలిగే లాభాలను డెమోనిస్ట్రేషన్ ద్వారా తెలియజేశారు