వెలిగండ్ల తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని, అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. తహసిల్దార్ కార్యాలయం చుట్టూ ప్రజలను ఎక్కువ రోజులు తిప్పుకోకుండా, నిర్దిష్ట కాల పరిమితిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మండలంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.